తల్లిదండ్రులను సాగనంపేందుకు వచ్చి.. రైలు నుంచి కిందపడ్డాడు.. అంతే?

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (10:50 IST)
తల్లిదండ్రుల కళ్ల ముందే దారుణం జరిగిపోయింది. తల్లిదండ్రులను సాగనంపేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చిన టెక్కీ ప్రాణాలు కోల్పోయాడు. కదులుతున్న రైలు నుంచి దిగే క్రమంలో టెక్కీ అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి కేరళలోని పాలక్కాడ్ జిల్లా కంజికోడే గ్రామానికి చెందిన విక్రమ్ విజయన్ (28) బెంగళూరులోని విప్రో కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో విక్రమ్‌ను చూసేందుకు అతని తల్లిదండ్రులు బెంగళూరు వచ్చారు. కొద్ది రోజుల తర్వాత కేరళకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో కర్మేలారం రైల్వే స్టేషన్లో తల్లిదండ్రులను విక్రమ్ రైలు ఎక్కించి సాగనంపేందుకు వచ్చాడు.  రైలు కదలబోతుండగా దిగేందుకు విక్రమ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కింద పడ్డ విక్రమ్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
మరోవైపు కుమారుడు పడిపోవడాన్ని గమనించిన విజయన్ తానూ రైలు దిగబోయి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కళ్ల ముందే పెంచి పెద్ద చేసిన కుమారుడు కోల్పోవడం ఆ దంపతులను తీవ్రంగా కలచివేసింది. రైలు నుంచి తమ బిడ్డ కిందపడిపోతుండటం చూసి ఏమీ చేయలేకపోయామని.. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని వారు రోదిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

ఒకే వేదికపై ఎంగేజ్‌మెంట్ తర్వాత ర‌ష్మిక- విజ‌య్ కనిపించబోతున్నారట..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments