Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను ప్రభుత్వ ఉద్యోగిని... పెళ్లాడేందుకు వితంతువు లేదా విడాకులు తీసుకున్న మహిళ కావాలి....

Advertiesment
నేను ప్రభుత్వ ఉద్యోగిని... పెళ్లాడేందుకు వితంతువు లేదా విడాకులు తీసుకున్న మహిళ కావాలి....
, శుక్రవారం, 30 నవంబరు 2018 (11:29 IST)
ఇదే వాక్యం. ఈ చిన్న వాక్యంతో ఎందరో మహిళల జీవితాలతో చెలగాటమాడాడు ఓ మోసగాడు. భర్త చనిపోయిన లేదంటే విడాకులు తీసుకున్న మహిళలకు ఎర వేస్తాడు. ఆ తర్వాత దొరకగానే వారితో లైంగిక వాంఛలు తీర్చుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దోచేస్తాడు. కర్నాటకలో ఇలా దారుణాలు చేస్తున్న అతడిని పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.
 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... కర్నాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన రామకృష్ణ భర్త చనిపోయో లేదా విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేస్తాడు. ఇందుకోసం పత్రికల్లో నేను ప్రభుత్వ ఉద్యోగిని... పెళ్లాడేందుకు వితంతువు లేదా విడాకులు తీసుకున్న మహిళ కావాలి.... అంటూ ప్రకటనలు ఇస్తాడు. ఆ ప్రకటనలు చూసి స్పందించినవారి వివరాలు తీసుకుంటాడు. ఆ తర్వాత ఫలానా చోటకి రమ్మని వారికి మాయమాటలు చెప్పి నమ్మిస్తాడు. జీవితం ఇక నీతోనే అన్నట్లు చేసి వారితో లైంగిక వాంఛ తీర్చుకుంటాడు. ఆ తర్వాత వాటిని చూపించి బాధితుల వద్ద నగదు రాబడతాడు. 
 
ఇతడి ఆగడాలు కేవలం మాండ్యా వరకే పరిమితం కాలేదు. శివమొగ్గ, మైసూరు, చిక్ బళ్లాపుర, బాగల్ కోట్, చామరాజనగర, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఎంతోమంది వితంతువులను ఇదే వరసలో మోసం చేసి తప్పించుకున్నాడు. ఐతే చిక్‌మగళూరుకు చెందిన ఓ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలిని ఇలాగే మాయమాటలతో మోసం చేసి ఆమె వద్ద నుంచి నగలు తీసుకుని పారిపోతుండగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో అతడు ఆ ప్రాంతాన్ని దాటి వెళ్లకముందు వలవేసి పట్టేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను కనుక అసెంబ్లీలో అడుగు పెట్టానే అనుకోండి... : ప‌వ‌న్ క‌ళ్యాణ్