Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతికి వెయ్యి కోట్లిచ్చాం.. తప్పంతా చంద్రబాబుదే: అమిత్ షా ఆశ్చర్యం

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎన్డీయే విఫలమైందంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇంకా ఎన్డీయే నుంచి టీడీపీ తప్పకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీ

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (14:10 IST)
రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎన్డీయే విఫలమైందంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇంకా ఎన్డీయే నుంచి టీడీపీ తప్పకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఎ నుంచి వైదొలగడంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏపీ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
 
ఎన్డీఎ నుంచి వైదొలగాలని చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. తప్పంతా బాబుదేనని. ఏపీకి ఎంతో చేశామని లేఖలో చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కన్నా చంద్రబాబు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోందని అమిత్ షా చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేశారని తెలిపారు. మూడు ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చామన్నారు. 
 
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చిందని.. కానీ రాష్ట్రం కేవలం 12 శాతం మాత్రమే అమరావతి కోసం ఖర్చు చేసిందని అమిత్ షా ఆరోపించారు. ఇలా 12 శాతం ఖర్చుచేసి, 8 శాతానికి మాత్రమే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించిందని అమిత్ షా తెలిపారు. అమిత్ షా రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments