Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావను పెళ్లి చేసుకుని సంసారం చేయాలనుకుంది.. అక్కను చంపేసింది

బావతో సంసారం చేయాలనుకుంది. అంతే అక్కనే చంపేసింది ఓ యువతి. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాకు చెందిన భూపాలన్‌ (28) నదియ (24), భార్యాభర్తలు.

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (12:52 IST)
బావతో సంసారం చేయాలనుకుంది. అంతే అక్కనే చంపేసింది ఓ యువతి. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాకు చెందిన భూపాలన్‌ (28) నదియ (24), భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. తిరుప్పూర్ జిల్లా వీరపాండి సమీపంలోని ఇడువమ్‌ పాళయంలో నివాసం ఉంటున్నారు.
 
ఇక అదే ప్రాంతానికి చెందిన నదియ పిన్ని కూతురు రేఖ.. అప్పుడప్పుడు నదియ ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఈ నేపథ్యంలో ఈ నెల 14న భూపాలన్, అతని తమ్ముళ్లు పనికి వెళ్లారు. పనికి వెళ్లిన భూపాలన్‌ తమ్ముడు మణివాలన్‌ రాత్రి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న అన్న కొడుకు ఏడుస్తుండటంతో ఇంటి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో శవంగా పడి ఉన్న నదియాను చూసి పోలీసులకు సమాచారం అందించాడు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో హత్యకు ముందుగా నదియ ఇంటికి రేఖ వచ్చినట్లు గుర్తించారు. ఆమెని విచారించగా ప్రియుడు నాగరాజ్‌తో కలిసి నదియను హత్య చేసినట్లుగా రేఖ అంగీకరించింది. దీంతో వారిద్దరిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. రేఖకు అప్పటికే నాగరాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం వుండేదని.. ఆమె భర్త ఆమెతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలిసింది. ఇంకా రేఖ నాగరాజ్‌తో సహజీవనం చేస్తున్నాడు. 
 
కానీ అక్క భర్త భూపాలన్‌ ఆర్థికంగా స్థిరపడి ఉండటంతో అతడిని పెళ్లి చేసుకువాలని తలచింది. నదియ ప్రాణాలతో ఉంటే భూపాల్‌ను పెళ్లి చేసుకోవడం కుదరదని ప్రియుడు నాగరాజ్‌తో కలిసి అక్కను కడతేర్చిందని పోలీసులు చెప్తున్నారు. 
 
నదియాను రేఖ హత్య చేసేందుకు మరో కారణం కూడా వుందని.. నదియా భర్తతో రేఖ కలసి ఉన్న వీడియో మెమరీ కార్డు నదియాకి దొరికింది. ఆ మెమరీ కార్డును ఇవ్వమని రేఖ అడిగినా నదియా ఇవ్వలేదు. ఈ విషయమై కొన్నినెలల పాటు ఇద్దరికీ గొడవలున్నాయని.. అందుకే నదియాను రేఖ ప్రియుడితో కలిసి హతమార్చిందని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments