Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాణా కుంభకోణం కేసు: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తప్పలేదు. ఈ కేసులో రాంచీ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బీహార్ రాష్ట్రం దాణా కుంభకోణం నాలుగో కేసుపై విచారణ జరిప

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (12:28 IST)
దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తప్పలేదు. ఈ కేసులో రాంచీ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బీహార్ రాష్ట్రం దాణా కుంభకోణం నాలుగో కేసుపై విచారణ జరిపిన కోర్టు లాలూకి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 
 
1995, 1996 సంవత్సరాల్లో దుంకా ట్రెజరీ నుంచి 3.13 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసినట్లు విచారణలో తేలపడంతో పాటు ఇప్పటికే లాలూని దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఇందులో భాగంగా మార్చి 24 (శనివారం) ఏడేళ్ల శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇప్పటికే పూర్తయిన మూడు కేసుల్లోనూ లాలూకి శిక్ష పడింది. 
 
ప్రస్తుతం లాలూ జైలు జీవితం అనుభవిస్తున్నారు. మొదటి కేసులో ఐదేళ్లు, రెండో కేసులో మూడున్నర ఏళ్లు, మూడో కేసులో ఐదేళ్ల శిక్ష పడింది. నాలుగో కేసులో మాత్రం ఏడేళ్ల శిక్ష పడింది. ఇకపోతే, లాలూతో పాటు దాణా కుంభకోణం కేసులో మరో 31 మంది నిందితులుగా ఉన్నారు. బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం ఈ కేసులో నిర్ధోషిగా తేలారు. ఈ కేసులోనూ లాలూ దోషిగా తేలడంతో ఆయన ఇక ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments