Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులకు జైలు.. ఎక్కడ?

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా రాష్ట్రాల పోలీసులు వివిధ రకాలుగా కఠిన చర్యలు తీసుకుంటూ, అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా, మైనర్ల డ్రైవింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు.

మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులకు జైలు.. ఎక్కడ?
, శుక్రవారం, 2 మార్చి 2018 (08:39 IST)
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా రాష్ట్రాల పోలీసులు వివిధ రకాలుగా కఠిన చర్యలు తీసుకుంటూ, అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా, మైనర్ల డ్రైవింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ తల్లిదండ్రులను మభ్యపెట్టి యధేచ్చగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అందుకే పిల్లలు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులకు ఒక రోజు జైలుశిక్షలను అమలు చేస్తున్నారు. ఈ తరహా శిక్షలను అమలు చేస్తున్నది ఎక్కడోకాదు... మన హైదరాబాద్‌లోనే. 
 
భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం (ఎంవీ యాక్ట్‌) 16 యేళ్ల లోపు యువతీ యువకులు ఎలాంటి వాహనాలనూ నడపకూడదు. 16 ఏళ్లు నిండిన వారు మాత్రం కేవలం గేర్లు లేని సాధారణ వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే గేర్స్‌తో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. చట్టప్రకారం మైనర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన యజమాని కూడా శిక్షార్హుడే. 
 
అయితే, ఈ నిబంధనను తల్లిదండ్రులు లేదా మైనర్లు ఏమాత్రం పాటించడం లేదు. అసలు ఇలాంటి నిబంధన ఉందో లేదో అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. దీంతో ఇలాంటి వారిని గుర్తించేందుకు మైనర్‌ డ్రైవింగ్‌పై నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు నెల రోజులుగా స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహించారు. ఎవరైనా చిక్కితే జరిమానాతో సరిపెట్టడం లేదు. వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రైవర్లుగా ఉన్న మైనర్లు, వీరికి వాహనాలిచ్చిన తల్లిదండ్రులు, యజమానులపై కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. 
 
గత నెల రోజులకాలంలో 1,079 చార్జిషీట్లు దాఖలు చేయగా… మొత్తం 55 మంది తండ్రులకు ఒకటి నుంచి రెండు రోజులు జైలుశిక్ష పడింది. ఈనెల ఒకటో తేదీ గురువారం ఒక్కరోజే నాంపల్లిలోని 9వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కె.అల్తాఫ్‌ హుస్సేన్‌ 10 మందికి ఒకరోజు చొప్పున జైలు శిక్ష విధించారు. దీంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మనతో పొత్తు వద్దన్నది బీజేపీయే'... ఇక చూస్కోండి... : చంద్రబాబు