Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధం: దోషికి 60ఏళ్ల జైలు శిక్ష

పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధంలో దోషికి ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. పెన్సల్వేనియా హైస్కూల్లో అతి కిరాతకరంగా 21 మంది తోటి విద్యార్థులను బలి తీసుకున్న హిబ్రల్ (20)కు కోర్టు 60 ఏళ్ల శిక్ష విధించింది. దీంతో

Advertiesment
పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధం: దోషికి 60ఏళ్ల జైలు శిక్ష
, మంగళవారం, 23 జనవరి 2018 (12:20 IST)
పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధంలో దోషికి ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. పెన్సల్వేనియా హైస్కూల్లో అతి కిరాతకరంగా 21 మంది తోటి విద్యార్థులను బలి తీసుకున్న హిబ్రల్ (20)కు కోర్టు 60 ఏళ్ల శిక్ష విధించింది. దీంతో పెన్సల్వేనియా కోర్టు హల్‌ విద్యార్థుల తల్లిదండ్రుల చప్పట్లతో మారుమ్రోగిపోయింది. 
 
హిబ్రల్ మానసిక స్థితి బాగో లేకపోవడంతో.. అతనికి జైలు శిక్ష విధిస్తే ప్రయోజనం వుండదని అతని తరపు న్యాయవాది వాదించాడు. ఆ వాదనతో ఏకీభవించని జడ్జి.. హిబ్రల్ మానసిక స్థితిని అర్థం చేసుకునే మరణ శిక్ష విధించట్లేదని న్యాయమూర్తి తెలిపారు. కావాలంటే శిక్ష అనుభవించే ముందు హిబ్రల్‌కు మానసిక వైద్యం అందించేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. అయితే హిబ్రల్‌ మాత్రం శిక్షను అనుభవించేందుకు నేరుగా జైలుకు వెళ్లాడు.
 
2004 ఏప్రిల్‌ 9న ముర్రేస్విల్లెలోని ఫ్రాంక్లిన్ రీజనల్ హైస్కూల్లో తాను చదివే స్కూల్లోనే కత్తులతో వీరంగం వేసిన అలెక్స్ హ్రిబల్‌ తోటి విద్యార్థులపై దాడి చేశాడు. రెండు వంట గది కత్తులతో 21 మంది విద్యార్థులను, ఒక వ్యక్తిని విచక్షణరహితంగా పొడిచి చంపేసిన హిబ్రల్‌కు కోర్టు 60ఏళ్ల  శిక్షను ఖరారు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌ను వేధించిన ఆ ముగ్గురు..