Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు ఇలా సంక్రమిస్తుందట...

తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. నిజానికి అడిగి కనడం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లన

తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు ఇలా సంక్రమిస్తుందట...
, మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (14:07 IST)
తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. నిజానికి అడిగి కనడం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లితండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటు౦బంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృ దేవతలకు శ్రాద్దం నిర్వహించనందువలన పిత్రుశాపం సంక్రమిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
 
వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు. సంతానం కలుగదు. వ్యాపారాలలో నష్టం మొదలయినవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తరువాతి తరం అనుభవిస్తుంది. ఆడా,మగ అయినా సరే వయసులో దురలవాట్లకు బానిసైతే, ఆ పాపం తరువాతి తరం వ్యాధుల రూపంలో అనుభవిస్తుంది. అవిటిగా పుట్టడం, పుట్టుకతోనే భయంకరమైన వ్యాధులు సోకడం. ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్నా, కాల క్రమేనా అవయవాలు పాడవవడం జరుగుతుంది. దానినే "వంశపారంపర్యం" అంటారు. అందుకే వయసులో "ధర్మంగా" ఉంటే, పుట్టే వారు కూడా అదే ధర్మాన్ని పంచుకుని పుడతారు. జీవితంలో వృద్ధి చెందుతారు. కాబట్టి పుణ్యాలే కనుక చేస్తే ఇలాంటి పరిస్థితి రాదంటున్నారు జ్యోతిష్య నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#MahaShivaratri : శైవక్షేత్రాల్లో భక్తుల సందడి