Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మనతో పొత్తు వద్దన్నది బీజేపీయే'... ఇక చూస్కోండి... : చంద్రబాబు

వచ్చే యేడాది (2019)లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు మాత్రం ఉంటుందని పార్టీ నేతలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. అదేసమయంలో 'మనతో పొత్తు ఉండదని బీజేపీయే ప్రకటించింది.

Advertiesment
Chandrababu Naidu
, శుక్రవారం, 2 మార్చి 2018 (08:27 IST)
వచ్చే యేడాది (2019)లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు మాత్రం ఉంటుందని పార్టీ నేతలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. అదేసమయంలో 'మనతో పొత్తు ఉండదని బీజేపీయే ప్రకటించింది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడమే' అని పార్టీ నేతలకు దిశానిర్దేశంచేశారు. 
 
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన గత రెండురోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం బీజేపీతో పొత్తు వద్దని పదేపదే విజ్ఞప్తిచేశారు. దీనిపై చంద్రబాబు పైవిధంగా స్పందించారు. 
 
తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండబోదని బీజేపీ నేతలు ప్రకటించడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. 'ఫలానా కారణంతో వెళ్లిపోతున్నామని ఏమైనా చెప్పారా? వారి ప్రకటనలో ధర్మం ఉందా?' అంటూ ప్రశ్నించాయి. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో పొత్తు మాత్రం ఉంటుందనీ, కానీ, ఏ పార్టీతో అన్నది ఎన్నికల సమయంలో తేల్చుతానని చెప్పారు. 
 
అలాగే, ప్రతిపక్షంలో ఎంతమంది నాయకులు ఉన్నారన్నది ముఖ్యం కాదు. తమ కోసం పోరాటం చేశారన్న విశ్వాసం ప్రజల్లో కల్పించడమే కీలకం అని పార్టీ నేతలకు ఉపదేశం చేశారు. అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, ఖమ్మం జిల్లాలో సమావేశానికి తాను హాజరవుతానని వారికి చంద్రబాబు హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 5 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ