నీరజ్ చోప్రాకు బ్రహ్మరథం: టాటా ఏఐఏకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (12:23 IST)
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. క్రికెటర్లు తప్ప మరో క్రీడాకారుల గురించి పెద్దగా తెలియని.. పట్టించుకోని భారతదేశంలో ఇప్పుడు నీరజ్ చోప్రా యూత్‌కు ఐకాన్‌గా మారిపోయాడంటే అతిశయోక్తి కాదు. 
 
గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించని వారు లేరనుకుంటున్న తరుణంలో టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అడుగు ముందుకేసింది. నీరజ్ చోప్రాను బ్రాండ్ బాసిడర్‌గా నియమించుకుంది.
 
నీరజ్ చోప్రా తమకు బహుళ సంత్సరాల బ్రాండ్‌ భాగస్వామ్యంగా టాటా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వినియోగదారులుకు అత్యుత్తమ జీవిత బీమా, ఆరోగ్య బీమా రక్షణకుతోడు, ఆరోగ్య పరిష్కారాలను అందించాలన్న కంపెనీ ప్రయత్నాలకు నీరజ్‌చోప్రా మంచి ఊపు కల్పిస్తారని భావిస్తున్నట్లు టాటా ఏఐఏ లైఫ్‌ పేర్కొంది. 
 
నీరజ్‌ భాగస్వామ్యంతో మారుమూల ప్రాంతాలకు కూడా తమ కంపెనీ మరింత విస్తరించడమే కాదు.. క్రికటేతర క్రీడాకారులు, అథ్లెట్లకు మంచి స్ఫూర్తి కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments