మెగా సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలని నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అంతేనా.. రాష్ట్రపతిగా రతన్‌టాటా పేరును సూచించి.. అందరిని ఆశ్చర్యపరిచారు నాగబాబు. దేశంలోనే అతి పెద్ద, గొప్ప మనసున్న పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్ టాటా తదుపరి రాష్ట్రపతి కావాలని నాగబాబు కోరుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
''ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులును ఎదుర్కొంటోంది రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. ఇలాంటి సమయంలో తదుపరి రాష్ట్రపతి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు పన్నే వ్యక్తి కాకుండా.. దేశాన్ని తన కుటుంబంలా భావించి ప్రేమించే వ్యక్తి అయితే బాగుంటుంది.
భారత దేశ తదుపరి రాష్ట్రపతిగా నేను ప్రతిపాదించే వ్యక్తి ఎవరంటే రతన్ టాటా గారు'' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. దాంతో పాటు #RatanTataforPresident అనే హ్యాష్‌ట్యాగ్‌ని షేర్ చేశారు.
ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం దాదాపుగా మరో ఏడాది వరకు ఉంది. దీని పైన జాతీయ స్థాయిలో కూడా కొన్ని రోజులుగా అప్పుడప్పుడు చర్చలు జరుగుతున్నా…నిర్దిష్టంగా ఎవరు పోటీలో ఉంటారనే అంశం పై క్లారిటీ లేదు.
ఇక ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తదుపరి రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ దాని గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాంటిది ఇప్పుడు ఇంత సడెన్‌గా రాష్ట్రపతి ఎన్నిక అంశం పైన నాగబాబు ఎందుకు స్పందించారనేది చర్చనీయాంశంగా మారింది.
నాగబాబు.. రతన్ టాటా పేరు ఎందుకు ప్రస్తావించారు అనే టాపిక్ పక్కన పెడితే.. చాలామంది నెటిజన్లు నాగబాబుకి మద్దతుగా నిలుస్తున్నారు. దేశానికి రతన్ టాటా అయితే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు. రతన్ టాటా కేవలం బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు గొప్ప మనసున్న వ్యక్తి కూడా. ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం అందిస్తున్నారు. ధారాళంగా విరాళాలు ఇచ్చారు.
ఇక రతన్ టాటా దేశ భక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. దేశం కష్టంలో ఉంది అంటే.. నేను ఉన్నాను అంటూ ఆర్ధికంగా ఆదుకోవడానికి ముందుకొస్తారు. కరోనా సమయంలో దేశం ఆర్ధిక కష్టాల్లో ఉన్న సమయంలో భారీ విరాళం అందించారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటే తత్వం ఈయనకు ఇతరుల కన్నా ప్రత్యకంగా నిలిపింది. టాటా గ్రూప్‌కు గౌరవ చైర్మన్‌గా ఉన్నా ఈయన అందరికీ ఆదర్శమని చెప్పుకోవచ్చు. ఎలాంటి గర్వం ఉండదు. చాలా సాధారణమైన జీవనాన్ని కొనసాగిస్తారు.