Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుకలు 12 బాటిళ్ల మద్యాన్ని తాగేశాయి..

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (16:27 IST)
ఎలుకలు 12 బాటిళ్ల మద్యాన్ని ఖాళీ చేశాయి. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నీలగిరి జిల్లా శివారులోని టాస్మాక్ దుకాణంలో చోటు చేసుకుంది. 
 
సోమవారం ఉద్యోగి దుకాణం తెరిచిన సమయంలో 12 సీసాల మధ్యం ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) కదంపూజాలో ప్రాంతంలో ప్రభుత్వం మద్యం దుకాణం నిర్వహిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాన్ని సిబ్బంది మూసివేశారు.
 
నిబంధనలు సడలించడంతో.. చాలా రోజుల తర్వాత సోమవారం దుకాణం తిరిగి తెరిచిన సమయంలో 12 బాటిళ్లలో మద్యం ఖాళీగా ఉంది. అయితే, బాటిళ్ల సీసాలు ఖాళీగా ఉండడాన్ని గుర్తించారు. వాటిపై ఎలుకలు కొరికినట్లు గుర్తులు ఉన్నాయి. ఆ తర్వాత సదరు ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. 
 
టాస్మాక్‌ సీనియర్‌ అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో దుకాణం వద్ద ఎలుకలు పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించారు. అవే సీసాల నుంచి మద్యం ఖాళీ చేశాయని తేల్చారు. ఒక్కో మద్యం బాటిల్‌ ధర రూ.1500 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments