Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంకీ ఛైర్మ‌న్ ఇంట్లో ఐ.టి.సోదాలు, వైసీపీ ఎంపీకీ త‌ప్ప‌లేదా?

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (16:04 IST)
వైసీపీ ఎంపీ, రాంకి గ్రూపు చైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు మొద‌ల‌య్యాయి. హైదరాబాదులో 15 చోట్ల ఇన్ కం టాక్స్ టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వ‌హించింది. ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన గచ్చిబౌలి నివాసంలో సోదాలు చేశారు.

అదేవిధంగా ఏక‌కాలంలో గచ్చిబౌలి రాంకి ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు జ‌రిపారు. దీనితోపాటు రాంకి అనుబంధ సంస్థల్లో సైతం ఐటీ సోదాలు చేస్తోంది. 15 బృందాలు వివిధ‌ ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేస్తున్నాయి.
 
మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి సోద‌రుడు అయోధ్య రామిరెడ్డి. పార్టీకి ఈ అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రు చేసిన సేవ‌కు ప్ర‌తిఫ‌లంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల అయోధ్య రామిరెడ్డికి రాజ్య‌స‌భ టిక్కెట్ ఇచ్చారు.

ఒక ప‌క్క ఏపీ సీఐడి ఎంపీ ర‌ఘురామ‌పై దాడులు చేస్తున్న త‌రుణంలో, అదే పార్టీకి చెందిన ఎంపీ ఆళ్ళ‌ అయోధ్య రామిరెడ్డి కంపెనీ రాంకీపై కేంద్రం ఐ.టి. దాడులు జ‌ర‌ప‌డం యాధృచ్చికం అయినా, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను త‌ల‌పిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments