స్విగ్గీ ఎంత మంచి పనిచేసింది.. నెటిజన్ల ప్రశంసల వర్షం

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (19:03 IST)
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఒకటైన స్విగ్గీ.. తొలిసారిగా సంయుక్తా విజయన్ అనే ట్రాన్స్‌‍జెండర్‌కు ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించింది. ఐటీ నిపుణురాలైన సంయుక్త విజయ్.. తమిళనాడు, పొల్లాచ్చికి చెందిన వ్యక్తి. ఫ్యాషన్ డిజైనర్‌ అయిన ఈమె, అమేజాన్ సంస్థలో కొన్ని సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. ఇంకా హిజ్రాల కోసం వారి హెయిర్ స్టైల్ కోసం ఓ స్టూడియోను కూడా నిర్వహిస్తున్నారు. 
 
అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసిన ఈమె, గత 2017వ సంవత్సరం భారత్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో సంయుక్తా ప్రస్తుతం ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సంస్థకు ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా కీలక పదవికి ఎంపికయ్యారు. ఈ మేరకు ఓ ప్రైవేట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు హిజ్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. 
 
ఇంకా కార్పొరేట్ సంస్థలు హిజ్రాల కోసం మద్దతిచ్చే కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. హిజ్రాలైన తమకు కుటుంబీకుల మద్దతు లభిస్తే బాగుంటుందని.. తనకు విద్య, ఉపాధి విషయాల్లో కుటుంబీకుల సపోర్ట్ లభించడంతోనే ఈ స్థాయికి రాణించగలిగానని చెప్పుకొచ్చారు. 
 
కానీ కొందరికి కుటుంబీకుల మద్దతు కరువవుతోందని.. వారికి ఇంటర్నెట్‌షిప్ లేదా ఇతర కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తే.. హిజ్రాలకు సులభంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంయుక్త అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments