ఆంటీతో అక్రమ సంబంధం... రసపట్టులో ఉండగా ఇంటికొచ్చిన మామ.. ఆ తరువాత?

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (19:02 IST)
వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణం పోవడానికి కారణమైంది. కొన్నేళ్లుగా అర్థరాత్రి పెళ్లయిన తన ప్రియురాలిని కలుస్తూ వచ్చిన ఆ యువకుడు... ఈ క్రమంలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలాడు. ముంబైలో అగ్రిపద ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడు కొద్దినెలలుగా ముంబైలోని తన మేనమామతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. 
 
అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మరో వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఈ విషయం యువకుడి మేనమామకు తెలియడంతో... అప్పటి నుంచి కొద్దిరోజుల పాటు తన ప్రియురాలికి దూరంగా ఉంటూ వచ్చాడు.
 
అయితే మళ్లీ ఎప్పటిలాగే ఆమెను కలవడం మొదలుపెట్టిన అతడు... అర్థరాత్రి సమయంలో దొడ్డిదారిన ఆమె ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లడం మొదలుపెట్టాడు. 9వ అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లోకి కిటికీల ద్వారా చేరుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఉన్నట్టుండి మహిళ భర్త రావడంతో ఏం చేయాలో అర్థంకాక తాను పట్టుకున్న కిటికీని వదిలేశాడు యువకుడు. వర్షాల కారణంగా కిటికీ గోడలు తడిచి ఉండటంతో ఒక్కసారిగా పట్టుతప్పి కిందపడి చనిపోయాడు. 
 
మరుసటి రోజు ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... స్థానికులు, అతడి కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు వివాహితను కలిసే క్రమంలోనే అతడు చనిపోయాడని నిర్ధారణకు వచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments