నల్గొండ జిల్లాలో వివాహేతర సంబంధం ఒక ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడి భర్తను అతి దారుణంగా హత్య చేసింది భార్య. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
మల్లేశం, నాగరాణిలకు గత 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఉన్న ఎలక్ట్రికల్ షాప్‌లో మల్లేశం పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. తన ఇంటి దగ్గరలో ఉన్న ఒక యువకుడితో నాగరాణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త చాలాసార్లు భార్యను మందలించాడు.
అయినా ఆమెలో మార్పు రాలేదు. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో వంట గదిలోని పదునైన కత్తితో భర్తను అతి దారుణంగా నరికి చంపిన నాగ రాణి, ఆ హత్య దోపిడీ దొంగల పని అని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు తమ స్టైల్‌లో విచారించడంతో నిజాన్ని ఒప్పుకుంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.