Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

గొంతు పిసికి .. సుత్తితో తలపై మోది.. ప్రియుడిపై మోజులో భార్య ఘాతుకం

Advertiesment
Telangana
, శనివారం, 6 జులై 2019 (14:11 IST)
మరో వివాహిత అత్యంత క్రూరంగా నడుచుకుంది. ప్రియుడిపై మోజుతో కుట్టుకున్న భర్తనే కడతేర్చింది. ప్రియుడుతో కలిసి గొంతుపిసికి, తలపై సుత్తితో మోది కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కేంద్రంలోని చైత్యనపురి కాలనీలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... నల్గొండ, చైతన్యపురి కాలనీకి చెందిన సోమ కేశవులు అనే రియల్టర్ ఉండగా, ఈయనకు భార్య స్వాతి ఉన్నారు. ఈమెకు అదే ప్రాంతానికి దుబ్బ ప్రదీప్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ తంతూ గత మూడేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. 
 
అయితే, ఈ విషయం భర్తకు తెలియడంతో కుటుంబంలో గొడవలు మొదల్యాయి. పైగా, భార్యను వేధించసాగాడు. తరచుగా ఫోన్‌లో మాట్లాడడం, వాట్సప్‌లో ఫొటోలు ఉండడంతో ఇద్దరి మధ్య తరచుగా ఘర్షణలు జరిగాయి. దీంతో స్వాతి తన భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం రూ.2 లక్షలు ఇస్తానని స్వాతి ప్రియుడికి చెప్పింది. 
 
ఈ క్రమంలో ప్రియుడు దుబ్బ ప్రదీప్‌ సోమ కేశవులును హత్య చేసేందుకు బొట్టుగూడలో ప్రింటర్‌గా పనిచేస్తున్న కొడిదేటి శివకుమార్‌ను సంప్రదించాడు. స్వాతితో తనకున్న సంబంధాన్ని వివరించాడు. స్వాతి భర్త అడ్డు తొలగించాలని చెప్పడంతో హత్యకు ప్లాన్‌ వేశారు. వీరిద్దరితో పాటు వెంకపల్లి గ్రామానికి చెందిన కంబం ప్రసాద్, బొట్టుగూడకు చెందిన ఆటోడ్రైవర్‌ చింతపల్లి నగేశ్, ప్రదీప్‌ అందరూ కలిసి హత్య చేశారు. 
 
మద్యంలో మత్తు కలిపి ఇవ్వడంతో కేశవులు అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి హత్య చేశారు. కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా భర్త గొంతు పిసికి, తలపై బండరాయితో మోదింది. ఈ దెబ్బలను తాళలేక కేశవులు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి.. హత్య కేసులోని మిస్టరీని ఛేదించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియాలో కుమార్తె న్యూడ్ ఫోటోల వైరల్.. తండ్రి ఏం చేశాడంటే...