Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ షోలో ట్రాన్స్‌జెండర్? ఒక్కసారిగా పెరిగిన హైప్

Advertiesment
బిగ్ బాస్ షోలో ట్రాన్స్‌జెండర్? ఒక్కసారిగా పెరిగిన హైప్
, బుధవారం, 22 మే 2019 (12:52 IST)
బిగ్ రియాలిటీ షో హిందీలో ప్రారంభమయ్యాక దాని హైప్ చూసి దక్షిణాదిలో కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే తెలుగు, తమిళ భాషలలో విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో మూడవ సీజన్ కోసం సన్నద్ధమవుతోంది. వివిధ వయస్సులు, నేపథ్యాలు, మనస్తత్వాలు కలిగినవారిని తీసుకొచ్చి కొంతకాలం పాటు ఒకే ఇంట్లో ఉండేలా చేయడమే ఈ కార్యక్రమం. 
 
మొదటి రెండు సీజన్లు విజయవంతం కావడంతో మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో షో నిర్వాహకులు కూడా మరిన్న ఆసక్తికర మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు భాషల ప్రసారమైన ఈ షోలో లెస్పియన్లు, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్స్(ఎల్.జి.బి.టి.క్యూ) కూడా పాల్గొన్నారు. 
 
తమిళంలో కమల్ హాసన్ హోస్ట్‌గా మొదలుకానున్న సీజన్ 3లో ఇప్పుడు ఈ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి చోటు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీజన్ 3పై ఒక్కసారిగా హైప్ పెరిగింది.
 
‘బిగ్ బాస్' రియాల్టీ షోలో కేవలం వినోదం మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో కమల్ హాసన్ అందించిన సూచన మేరకు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారట. 
 
ఈ షోలో అందరినీ సమానంగా చూస్తున్నామనే సందేశం ప్రజల్లోకి పంపడంతో పాటుగా ఎన్నో ఏళ్లుగా లెస్పియన్లు, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్స్ మీద ప్రజలలో ఉన్న అపోహలను తొలగించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారంట. ఇప్పటికే ‘బిగ్ బాస్ సీజన్ 3'లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ విషయంలో అనేక రూమర్స్ స్ప్రెడ్ అవుతుండగా కొత్తగా ఈ విషయం వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాజల్ అగర్వాల్ పి.హెచ్‌.డి ఎక్కడో తెలుసా?