Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూరత్‌లో భాగీ అగ్నిప్రమాదం.. 19 మంది మృతి.. 3వ అంతస్తునుంచి దూకి....

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (19:08 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కోచింగ్ సెంటర్‌లో సంభవించిన ఈ ప్రమాదంలో యువతీయువకులు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు నాలుగో అంతస్తుల భవనం నుంచి కిందికి దూకేశారు. ఫలితంగా ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ ట్యూటర్ కూడా ఉన్నారు. ప్రాణాలు కాపాడుకొనేందుకు వీరంతా నాలుగో అంతస్థు నుంచి కిందికి దూకారు. 
 
ఈ అగ్నిప్రమాదం సర్తానాలోని తక్షశిల కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ భవనంలోని మూడో అంతస్తులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. మంటల నుంచి తప్పించుకునేందుకు పలువురు విద్యార్థులు కిందకు దూకారు. 
 
దీంతో పలువురి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలను ఆర్పేందుకు 18 ఫైరింజన్లు శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సూరత్ పోలీసు కమిషనర్ తెలిపారు. మృతులంతా 15 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారే. 
 
ఈ అగ్నిప్రమాద ఘటనపై నరేంద్ర మోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మోడీ ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని విజయ్ రూపానీ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments