తిరుపతి ఓట్ల లెక్కింపు కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎవరి పని?

మంగళవారం, 21 మే 2019 (12:19 IST)
ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగింది.

అయితే, ఈ ప్రమాదం వల్ల ఈవీఎంలు భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదనీ, ఓట్ల లెక్కింపు యధావిధిగా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదంపై వైకాపా, టీడీపీ నేతలు పలు అనుమానాలు వెల్లడిస్తున్నారు. ఈ పని చేసింది వైకాపా నేతలు అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. కాదు టీడీపీ నేతలేనంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
 
మరోవైపు, ఈ దఫా ఎన్నికల పోటీలో టీడీపీ తరపున దివంగత ఎమ్మెల్యే వెంకట రమణ భార్య ఎం సుగుణమ్మ పోటీలో వుంటే వైకాపా తరపున భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 
 
నిజానికి గత 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎం.వెంకటరమణ కొద్ది కాలానికే చనిపోవడంతో ఆయన భార్య ఎం.సుగుణను ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. వైసీపీ పోటీ పెట్టకపోవడంతో ఆమె లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. పోటీ తీవ్రంగానే ఉండనున్నది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చదవడం లేదనీ ఐదేళ్ళ బిడ్డను కొట్టి చంపిన తల్లి...