బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో కేక్‌ను ముఖానికి పూస్తున్నారా..? ఐతే జైలుకి వెళ్లాల్సిందే!!

గురువారం, 16 మే 2019 (17:59 IST)
సాధారణంగా బర్త్‌డే సెలబ్రేషన్ అంటే చాలు చాలామంది కేక్ కట్ చేయించి, పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి ముఖాన్ని కేక్‌తో ముంచేస్తారు. కొంత మంది అత్యుత్సాహంతో ఎక్కడ పడితే అక్కడ కేక్ పూస్తారు.

అయితే ఇకపై ఇలా చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇది అక్షరాలా నిజమండీ బాబూ. హద్దులు దాటుతున్న బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను కట్టడి చేయడానికి గుజరాత్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ నియమాలను ఉల్లంఘిస్తే జైలు తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్‌లోని సూరత్ పట్టణ పోలీస్ కమీషనర్ ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేశారు. అంతే కాదు ఇకపై సూరత్‌లో నిర్వహించే బర్త్‌డే వేడుకల్లో ముఖంపై కేక్ పూసినా, ఫోమ్ స్ప్రే చేసినా జైలుకు వెళ్లాల్సిందేనట.
 
ఈ కఠినమైన రూల్స్ తేవడానికి కారణం లేకపోలేదు. ఇటీవల సూరత్‌లోని ఇమాస్ రోడ్డులో కొంతమంది ఒక బర్త్‌డే వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో కోడిగుడ్లు విసరడం వల్ల పలువురు రోడ్డుపై పడిపోయి గాయాలయ్యాయి. 
 
దీనిపై పోలీస్ కమీషనర్ సతీష్ శర్మకు ఫిర్యాదు అందింది. వెంటనే స్థానిక పోలీసులు ఆ వేడుకలో పాల్గొన్న కొంతమందిని అదుపులోకి తీసుకుని వారిపై సెక్షన్ 188 కింద కేసు కూడా నమోదు చేశారు. కాగా ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదని పోలీస్ కమీషనర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శ్రేయా ఘోషల్‌కి చేదు అనుభవం... విలువైన వాయిద్య పరికరాలుంటే?