Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

మంచి నీటి నల్లా వద్ద ఘర్షణ : బాలింత మృతి

Advertiesment
Kurnool
, శుక్రవారం, 10 మే 2019 (12:38 IST)
కర్నూలు జిల్లాలో ఓ బాలింత ప్రాణాలు కోల్పోయింది. మంచినీటి నల్లా వద్ద జరిగిన చిన్నపాటి ఘర్షణలో ఆమె చనిపోయింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన శుక్రవారం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన షేక్షావలి, షేకున్‌బీ అనే దంపతుల కుమార్తె మౌలాబీ. ఈమెకు ఐదేళ్ళ క్రితం వివాహం జరిగింది. ఈమె రెండు నెలల క్రితం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత పుట్టింట్లోనే ఉంటూ వస్తోంది.
 
అయితే, కర్నూలు పట్టణంలో తీవ్రమైన నీటి ఎద్దటి నెలకొనివుంది. దీంతో పట్ణంలోని కాలనీవాసులంతా కుళాయి నీళ్లను వంతుల వారిగా పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మౌలాబీ నీళ్ల కోసం కుళాయి వద్దకు వెళ్లింది. కుళాయి వద్ద నీరు పట్టుకునే క్రమంలో పక్క గుడిసెలో ఉంటున్న రామచంద్రమ్మతో మాటామాటా పెరిగి గొడవ జరిగింది.
 
పని నుంచి తిరిగి వచ్చిన తల్లికి ఆమె విషయం చెప్పటంతో మళ్లీ గొడవ పెట్టుకుంది. దీంతో రామచంద్రమ్మ కుటుంబసభ్యులు షేకున్‌బీపై దాడి చేశారు. అయితే తల్లిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన మౌలాబీని రామచంద్రమ్మ కుటుంబసభ్యులు కొట్టి వెనక్కి తోసేశారు. దీంతో కింద పడ్డ మౌలాబీ  తలకు బలమైన గాయం తగలడంతో అపస్మరకస్థితిలోకి జారుకుంది. 
 
ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రామచంద్రమ్మ, భర్త రత్నమయ్య, కుమార్తె మనీషాలపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితులని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలో టాప్-10 అత్యుత్తమ విమానాశ్రయాలు ఏవి?