Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్రపరిశ్రమపై కేంద్ర మంత్రి ప్రశంసలు.. బన్నీకి మద్దతుగా..

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (10:02 IST)
తెలుగు చిత్రపరిశ్రమపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ చిత్రపరిశ్రమను టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు. అదేసమయంలో పుష్ప చిత్ర హీరో అల్లు అర్జున్‌పై తొక్కిసలాట కేసు, అరెస్టు, జైలు, తదితర అంశాలపై ఆయన స్పందిస్తూ, అల్లు అర్జున్‌కు అండగా నిలించారు. 
 
'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నటుడు అల్లు అర్జున్‌పై తెలంగాణ పోలీసుల చర్యలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా బన్నీకి మద్దతుగా నిలిచారు. కావాలనే కొందరు తెలుగు నటుడి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
 
ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ, "భారత సినీ పరిశ్రమలో తెలుగు నటీనటుల సహకారం అమోఘం. వారు భారతీయ సినిమాను ప్రపంచపటంపై నిలిపారు. కానీ కొంతమంది తెలుగు నటులను క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా చూస్తే.. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అల్లు అర్జున్‌ని జాతీయ అవార్డు, చిరంజీవికి  జీవిత సాఫల్య పురస్కారాలు లభించాయి. 
 
తెలుగు సినిమా సేవల్ని యావత్ దేశం, ప్రపంచం గుర్తించింది. 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'కేజీఎఫ్', 'బాహుబలి ' వంటి చిత్రాలు ఇండియన్ సినిమాకి ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. రాజకీయాలకు బదులు చర్చలు జరిపి వివాదాలకు ముగింపు పలకాలి. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేల ప్రకటనలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి" అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments