Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అద్రుష్టం నావైపు వుందేమోనని అనుకుంటున్నా : యాంకర్ వింధ్య విశాఖ

Anchor Vindhya Visakha

డీవీ

, మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (18:56 IST)
Anchor Vindhya Visakha
యాంకరింగ్ లో సుమ, ఝన్సీ, మంజూష ఇలా కొంతమంది వుంటే స్పోర్ట్స్ యాంకర్ గా పేరు పొందిన యాంకర్ వింధ్య విశాఖ. ఈమెను స్పోర్ట్స్ పర్సన్ ను చేయాలని ఆమె తల్లి కోరిక. ఎందుకంటే ఆమె తల్లి టెన్నిస్ ప్లేయర్. పుల్లెల గోపీచంద్ భార్యతో కలిసి పలు ఈవెంట్ లో ఆడారు. కానీ అప్పట్లో నిక్కర్ వేసుకోవడం అనేది వారి ఇంటిలో సాంప్రదాయం కాదుకనుక వద్దని వారించారు. దాంతో కూతురిని అయినా క్రీడాకారిణి చేయాలనుకుంది. కానీ విధి చిత్రం క్రీడాకార్యక్రమాలకు యాంకర్ గా కూతరు మారింది. ఆమె వింధ్య విశాఖ. పెక్యులర్ వాయిస్ తో జాతీయ స్థాయిలో అలరిస్తుంది. ఇప్పుడు సినిమా ఈవెంట్ లలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమెను పలుకరిస్తే... 
 
ఇంటిలో వారు అమ్మను క్రీడాకారిణిగా వద్దనగానే టీచర్ గా మారింది. అమ్మ టీచర్ వున్న స్కూల్లో నేను చదివేదానిని.  నాలా నువ్వు వుండకూదని అమ్మ చెప్పేది. స్పోర్ట్స్ లో పాల్గొనాలని కోరేది. కాలక్రమేణా తెలీయకుండా నేను  యాంకర్ గా మారిపోయాను. ఓ సారి స్పోర్ట్స్ ఆడిషన్ కు ముంబై వెళ్ళాను. అలా  2011లో యాంకర్ గా చేశాను. స్టార్ స్పోర్ట్ కాల్ రాగానే పాన్ టరీ లో కాఫీ తాగుతుండగా కపిల్ దేవ్ నుచూశాను. అక్కడ అందరూ లెజెండ్స్ వున్నారు. అలా క్రికెట్, కబడ్డీ అన్నీ ఒకే చోట జరిగేవి. స్టార్ స్పోర్స్ తెలుగులో నేను యాంకర్ గా మొదలు పెట్టాను. 
 
ఇప్పుడున్న యాంకర్లలో సుమ, మంజుష ను చూస్తే.. నేను ఇంకా వారిలా యాంకరింగ్ చేయలేకపోతున్నానే అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంజుష వాడుతున్న తెలుగు పదాలు చూసి ఆశ్చర్యపోయాను. చాలా గర్వంగా వుంది. అలాగే సుమగారు కూడా స్పాంటేనియస్ గా స్పందిస్తారు. అలాగే ఝాన్సీ, ఉదయభాను తర్వాత ఎవరు యాంకరింగ్ గా వస్తారని అనిపించేది. ఆ ప్లేస్ మంజూష దక్కించుకుంది. 
 
యాంకర్స్ స్టేజీ పై వున్నప్పుడు కొంతమంది చాలా దగ్గరకు వచ్చి టచ్ చేయడం అనేది జరుగుతుంటుంది. కానీ నా ద్రుష్టిలో అటువంటిది జరగలేదు. అద్రుష్టం నావైపు వుందేమోనని అనుకుంటున్నా. ఏదిఏమైనా నేను చాలా పద్ధతిగా వుంటాను. సాంప్రదాయాన్ని గౌరవిస్తాను. ఏదైనా నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తాను. అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి దర్శకురాలి దాకా....