Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజా మార్కండేయ వేట మొదలైంది టైటిల్ ప్రకటన

Bunny Ashwant,  Sama Prashanthi

డీవీ

, సోమవారం, 26 ఆగస్టు 2024 (17:52 IST)
Bunny Ashwant, Sama Prashanthi
బన్నీ అశ్వంత్ ను దర్శకుడు గా పరిచయం చేస్తూ శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ సామా - వెంకట్ గౌడ్ పంజాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రాజా మార్కండేయ" అనే పవర్'ఫుల్ టైటిల్ ప్రకటించారు.  ఈ చిత్రానికి "వేట మొదలైంది" అన్నది ట్యాగ్ లైన్. తేజస్ వీరమాచినేని, అక్షయ రోమి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గౌరిశెట్టి - బన్నీ అశ్వంత్ సహ నిర్మాతలు. ప్రముఖ నటుడు సుమన్ ముఖ్య అతిధిగా, ప్రముఖ నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వైశ్య ప్రముఖులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గంగపురం పద్మగౌడ్, నవీన్ మాచర్ల విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
 
కంటెంట్ బాగుంటే... చిన్న చిత్రాలు కూడా కోట్లు కొల్లగొడుతున్నాయని, "రాజా మార్కండేయ" ఆ చిత్రాల కోవలో చేరాలని సుమన్ ఆకాంక్షించారు. సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయిందని పేర్కొన్న దర్శకనిర్మాతలు.. ఈ చిత్ర రూపకల్పనలో సహాయసహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కిస్తున్న "రాజా మార్కండేయ" సంచలన విజయం సాధించి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని అతిధులు అభిలషించారు. 
 
నాగేష్, లయన్ సామ శ్రీధర్ గుప్తా, సామ ప్రశాంతి, సర్దార్ పంజాల వెంకట్ గౌడ్, గౌరిశెట్టి శ్రీనివాస్ గుప్తా, వంగపల్లి అంజయ్య స్వామి, వడ్డె మహేశ్వరి, పేరం నవీన్ కుమార్, రాధ, గ్రంధం శ్రీనివాస్ నాయుడు, సూర్యతేజ, సామ నరేష్, సూర్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పోస్టర్ డిజైనర్: పవన్ నాయుడు, సహాయ దర్శకులు: శంకర్, బ్రహ్మి నాయుడు, ఆర్ట్ డైరెక్టర్: మోరిశెట్టి మణిదీప్, సినిమాటోగ్రఫీ: సాయి, సహాయకుడు: సామా నరేష్, గౌరవ సలహాదారు; ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, వంగపల్లి అంజయ్య స్వామి,  సహ నిర్మాతలు: శ్రీనివాస్ గౌరిశెట్టి, బన్నీ అశ్వంత్, కో-ఆర్డినెటర్స్: పేరం నవీన్ కుమార్ - గోలి సంతోష్ కుమార్, ప్రశాంతి సామా, నిర్మాతలు: శ్రీధర్ సామా - వెంకట్ గౌడ్ పంజాల, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: బన్నీ అశ్వంత్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్ నమితకు చేదు అనుభవం.. ఆలయంలోకి అనుమతించలేదు.. (video)