Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా పోలీసు జుట్టు లాగాడు.. నిందితుడి అరెస్ట్

Advertiesment
Lady Cop

సెల్వి

, బుధవారం, 4 సెప్టెంబరు 2024 (09:12 IST)
Lady Cop
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో నిరసన కార్యక్రమంలో మహిళా పోలీసు జుట్టు లాగినందుకు ఒక వ్యక్తిని తమిళనాడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. విరుదునగర్‌లోని అరుప్పుకోట్టై ప్రాంతంలో రహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించిన నిరసనకారుల్లో నిందితుడు ఒకడు.
 
నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన ఒక మహిళా పోలీసు జుట్టు పట్టి లాగినట్లు ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 
 
సోమవారం కాళీకుమార్ అనే వ్యక్తిని పాత కక్షల కారణంగా కొంతమంది వ్యక్తులు హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం, కాళీకుమార్ మృతదేహాన్ని ఉంచిన ప్రభుత్వ ఆసుపత్రి వెలుపల అతని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సహా నిరసన చేపట్టారు. నిందితులను అరెస్టు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. 

నిరసనకారులు రహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించగా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) గాయత్రి, ఇతర పోలీసు సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
 
ఈ సంఘటన వీడియోలో నిరసనకారుడు ఒక మహిళా పోలీసు చేతిని తప్పించడం చూపిస్తుంది. దీంతో డిఎస్పీ గాయత్రి, ఇతర పోలీసు సిబ్బంది ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టేందుకు వారితో వాగ్వాదానికి దిగారు. 
 
పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో మరో వ్యక్తి డీఎస్పీ గాయత్రి జుట్టును లాగడం కనిపించింది.
 ఇతర పోలీసులు వెంటనే డిఎస్పీ గాయత్రిని ఆందోళనకారుల నుండి దూరంగా తీసుకెళ్లారు. 
 
వైరల్ వీడియోలో డీఎస్పీ జుట్టును లాగుతున్నట్లు కెమెరాలో చిక్కుకున్న 30 ఏళ్ల బాలమురుగన్‌ను పోలీసులు పట్టుకున్నారు. అదనంగా, నిరసనకు సంబంధించి మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. రేవంత్ రెడ్డి