Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఆపై ఆత్మహత్య చేసుకోమన్నారు.. చివరికి?

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (19:10 IST)
అక్కాచెల్లెళ్లపై అకృత్యం జరిగింది. పక్కింటి పోరగాళ్లు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంకా బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. పాముకాటుతో చనిపోయారని చెప్పాలని, లేదంటే హత్యచేస్తామని వాళ్ల తల్లిని బెదిరించారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కబెడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌లో జరిగింది.
 
ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో సోనిపట్‌లో ఉంటుంది. భర్త లేకపోవడంతో కూలినాలి చేసుకుంటూ తన 14, 16 ఏండ్ల కూతుళ్లను పోషించుకుంటుంది. వారుంటున్న ఇంటిపక్కనే నలుగురు కుర్రాళ్లు ఉంటున్నారు. వారు వలస కార్మికులు. ఆ నలుగురు యువకుల కన్ను ఆ ఇద్దరు యువతులపై పడింది. ఈనెల 5, 6 తేదీల్లో ఇద్దరు అమ్మాయిలపై లైంగికదాడి చేశారు. అనంతరం పురుగుల మందు తాగి చనిపోవాలని వారిపై ఒత్తిడిచేశారు. పాము కాటేసిందని చెప్పాలని వారి తల్లికి చెప్పారు. లేదంటే ఆమెను చంపుతామని బెదిరించారు. 
 
అయితే.. ఆత్మహత్యకు పాల్పడిన అక్కాచెల్లళ్లను స్థానికులు ఢిల్లీలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే ఒకరు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. మరొక అమ్మాయి చికిత్స పొందుతూ చనిపోయింది. పాము కాటేసిందని వారి తల్లి వైద్యులకు చెప్పింది. కాగా, విషయం పోలీసులకు తెలిసింది. తల్లిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments