Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళకు మత్తు మందు కలిపి కూల్‌డ్రింక్.. ఆపై సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (18:56 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేరాలుఘోరాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. ముఖ్యంగా, ఇటీవలి కాలంలో అనేక మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా ఓ మ‌హిళ‌కు మ‌త్తు మందు క‌లిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి అనంత‌రం ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న మీర‌ట్ జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని రోహ్త ప్రాంతంలో ఈ దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ కేసులో వేగంగా స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 
 
పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం లైంగిక దాడి కేసులో నిందితుల్లో ఒక‌రైన రోహ్తాకు చెందిన అమ‌ర్పాల్ రాస్నా ప్రాంతంలో హోట‌ల్ న‌డుపుతున్నాడు. హోట‌ల్ ఫ‌స్ట్ ఫ్లోర్‌లో అమ‌ర్పాల్ కుమారుడు ఉజ్వ‌ల్ జిమ్ సెంట‌ర్ ఏర్పాటు చేశాడు. 
 
శుక్ర‌వారం సాయంత్రం ఉజ్వ‌ల్ స్నేహితులు ఇద్ద‌రు ఓ మ‌హిళ‌ను హోట‌ల్‌కు తీసుకువ‌చ్చారు. వారు ఆమెకు కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి ఇచ్చారు. ఆపై ఆమె స్పృహ కోల్పోగా సామూహిక లైంగిక దాడికి తెగ‌బ‌డ్డారు. 
 
ఆమె మెల‌కువ రాగానే త‌న బంధువుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఇద్ద‌రు నిందితుల‌ను స్పాట్‌లో అరెస్ట్ చేశారు. ఇద్ద‌రు నిందితుల‌ను జిమ్ ఓన‌ర్ ఉజ్వ‌ల్‌, అత‌డి స్నేహితుడు సౌర‌భ్‌గా పోలీసులు గుర్తించారు. 
 
మూడో నిందితుడు మోను కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల‌ను అదుపులోకి తీసుకుని జైలుకు పంపిన పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం బాధిత మ‌హిళ‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు : నటి హేమకు తాత్కాలిక ఊరట!!

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత

చంద్రబాబు గారిని కలిసి కుప్పం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశానని ని చెప్పా : హీరో సుధీర్ బాబు

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

ఉడికించిన కూరగాయలు ఎందుకు తినాలో తెలిపే 8 ప్రధాన కారణాలు

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం