Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వార్డులో రెండు బెడ్లు.. పేషెంట్ల కొట్లాట.. గుండెపై కూర్చుని పిడిగుద్దులు.. చివరికి..?

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (15:33 IST)
ఉత్తరప్రదేశ్‌లో నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. షాజహాన్‌పూర్‌లోని ఓ మెడికల్ కాలేజీలో చేరిన పేషెంట్‌ని మరో పేషెంట్ చంపేశాడు. వాళ్లిద్దరూ ఓ బెడ్ కోసం కొట్టుకోగా ఇంత పని జరిగింది. అసలు గొడవ ఎలా జరిగిందంటే... అబ్ధుల్ రెహమాన్... ఎక్కడి నుంచో తన బెడ్ దగ్గరకు వచ్చాడు. అక్కడ ఆల్రెడీ మరో పేషెంట్ ఉన్నాడు "లెగవా... వెళ్లవా.." అంటూ హన్స్‌రామ్‌పై పిడిగుద్దులతో చెలరేగిపోయాడు. 
 
ఆ దెబ్బలు తట్టుకోలేక హన్స్‌రామ్ లబోదిబోమన్నాడు. ఆవేశంతో రెచ్చిపోయిన అబ్దుల్... గ్యాప్ లేకుండా గుద్దాడు. ఇంతలో ఆస్పత్రి సిబ్బంది పరుగెడుతూ అక్కడికి వచ్చారు. చూస్తే... అప్పటికే హన్స్‌రామ్ చనిపోయినట్లు తేలింది. పోలీసులు రావడం, కేసు రాయడం, అబ్దుల్‌ను అరెస్టు చెయ్యడం అన్నీ జరిగాయి. ఐతే... ఇంతలో అబ్దుల్ తండ్రి అక్కడికి వచ్చారు. తన కొడుకు అమాయకుడు అనీ... మానసిక అనారోగ్యంతో ఉండి... ట్రీట్‌మెంట్ పొందుతున్నాడని తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ల హన్స్‌రామ్... తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో శుక్రవారం చేరాడు. అలాగే 25 ఏళ్ల అబ్దుల్... డీ-హైడ్రేషన్ సమస్యతో... ఆస్పత్రిలో చేరాడు. ఇద్దరికీ ఒకే వార్డులో వేర్వేరు బెడ్లు ఇచ్చారు. ఆదివారం ఉదయం అబ్దుల్ టాయిలెట్‌కి వెళ్లి తన బెడ్ దగ్గరకు వచ్చాడు. అక్కడ అదే బెడ్‌పై హన్స్‌రామ్ ఉన్నాడు. నిజానికి అతను పొరపాటుగా ఈ బెడ్‌పై ఉన్నాడు.
 
తన బెడ్‌పై జ్వరం ఉన్న వ్యక్తి ఉండటంతో... అతనికి కరోనా ఉందేమో అని అబ్దుల్ టెన్షన్ పడ్డాడు. బెడ్ పై నుంచి లేవమనగానే లేవకుండా హన్స్‌రామ్ తిరగబడేసరికి అబ్దుల్‌కి పిచ్చి కోపం వచ్చింది. ఫలితంగా హన్స్‌రామ్‌ను బెడ్‌పై నుంచి కింద పడేసి... అతని రొమ్ముపై కూర్చొని దాడి చేశాడు. దాంతో హన్స్‌రామ్ చనిపోయాడు.
 
అబ్దుల్ మానసిక పేషెంట్ అన్న అతని తండ్రి... అందుకు సంబందించి పోలీసులకు ఎలాంటి మెడికల్ పత్రాలూ చూపించలేదు. దాంతో... పోలీసులు అతన్ని మానసిక రోగిగా గుర్తించలేదు. హన్స్‌రామ్ కుటుంబ సభ్యులు... ఆస్పత్రి దగ్గర ఆందోళన చేశారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే హన్స్‌రామ్ చనిపోయాడని నానా రభస చేశారు. పోలీసులు అబ్దుల్‌ని అరెస్టు చేయడంతో... వారు కాస్తంత శాంతించారు. మొత్తానికి ఇలా ఓ బెడ్ వివాదం ఓ ప్రాణం తీసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments