ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దిశగా పయనిస్తుంటే మహారాష్ట్ర, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరులలో లాక్‌డౌన్ సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే అక్కడ థియేటర్లలో సినిమాలు విడుదల పెద్దగా కాలేదు. ఈ ఏడాది జనవరి నుంచి తెలుగు సినీ పరిశ్రమలోని సక్సెస్ రేటు ఇతరచోట్ల లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇది గ్రహించిన తెలుగు చిత్ర పరిశ్రమ ముందు జాగ్రత్త దిశగా అడుగులు వేస్తోంది. పవన్‌కళ్యాణ్ సినిమా ఒక్కటే విడుదలకు గేట్లు తెరుచుకున్నాయి. దీని వెనుక దిల్‌రాజు వంటి ఉద్దంఢుడు వుండడంతో మిగిలిన సినిమా వాళ్ళు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఎప్పటికైనా తెలుగు సినిమాలకు గండి ఏర్పడే పరిస్థితి వుందని గ్రహించిన నిర్మాతలు వారి వారి సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. శేఖర్ కమ్ముల లవ్‌స్టోరీ ఇందుకు ఉదాహరణ. ఆ తర్వాత విడుదల కావాల్సిన టగ్ జగదీష్ సినిమా కూడా అనుమానాస్పందంగానే వుంది.
50శాతం కెపాసిటీ అని ఛాంబర్ చెబుతోంది
అయితే ప్రస్తుతం రెండు తెలుగు ప్రాంతాల్లలో పవన్ కళ్యాణ్ సినిమా ఏది పెద్దగా ప్రదర్శించడంలేదు. ఏవో డబ్బింగ్ సినిమాలు విడుదలవుతున్నాయి. వాటికి థియేటర్లలో ప్రేక్షకుడు రాక గగనమైపోయింది. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ సినిమా వారం తర్వాత థియేటర్లలో కెపాసిటీ యాభై శాతం మేరకు వుంటుందని వార్త పరిశ్రమవర్గాల్లో ఘాటుగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఛాంబర్ కూడా ధృవీకరించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్ లేదనీ, యాభై శాతం కెపాసిటీ విధించమని కానీ ప్రేక్షకుడు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనల మేరకే హాలులోకి రావాలని రూల్ పెట్టింది.
రెండువారాలవరకు సినిమాలు లేవు
ఏది ఏమైనా ఇలాంటి టైంలో తమ సినిమాలు విడుదల చేయడం మంచి పరిణామం కాదని చాలా మంది నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. నెలాఖరులో రావలసిన 'పాగల్, సిటీమార్' పరిస్థితి ఏమిటనేది కూడా తెలియటం లేదు దీనితో థియేటర్లలో ఫీడ్ కరువైపోయింది. ఎన్నిరోజులు వకీల్‌సాబ్ జనాలు చూస్తారు. అనే అనుమానం వారిలో కలిగింది. అందుకే స్వచ్చంధంగా కొంతమంది ఎగ్జిబిటర్లు థియేటర్ల మూసేదిశలో ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. మరోసారి థియేటర్లు బంద్ అయితే సినిమాలన్నీ ఓటీటీవైపు చూడవలసిందే. గతంలో ఓటీటీవారు ఇమేజ్ ఉన్న వారి సినిమాలను మంచి రేటు ఇచ్చి కొని నష్టపోయారు. ఈ సారి మాత్రం పే ఫర్ వ్యూ టైప్ ని అమలులో పెడతారట. సో దర్శకనిర్మాతలు ఒళ్ళు దగ్గరపెట్టుకోవాల్సిందే. ఇటీవలే తమన్నా కూడా తాను వెబ్‌సిరీస్‌లోనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్ చేస్తున్నట్లు చెప్పింది. దీన్ని బట్టి సినిమాలు పుంజుకోవాలంటే ఇంకా టైం పడుతుందని అర్థమవుతోంది.