Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస‌క్తిరేపుతున్న ఖిలాడి టీజ‌ర్ (video)‌

ఆస‌క్తిరేపుతున్న ఖిలాడి టీజ‌ర్ (video)‌
, సోమవారం, 12 ఏప్రియల్ 2021 (14:29 IST)
kiladi teaser
రవితేజ హీరోగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం టీజ‌ర్ ఈరోజు మ్య‌ద్యాహ్నం చిత్ర యూనిట్ విడుద‌ల చేసంది. దేవీశ్రీ‌ప్ర‌సాద్ బేక్ గ్రౌండ్ మ్యూజీక్‌తో హార‌ర్ ను త‌ల‌పించేలా వుంది.
 
రెండు కంటేనైర్లు, ఆ త‌ర్వాత ర‌వితేజ కొంత‌మంది బైక్‌తో వెతుక్కుంటూ వెల్ళ‌డం. ఓ చిన్న‌పిల్ల పారిపోవ‌డం ఆమెనే వెతుకుతున్న‌ట్లు ఫోన్ మాట్లాడ‌డం. ఛేజింగ్ దృశ్యాలు ర‌స‌వత్త‌రంగా అనిపించాయి. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేశాడు. ఖైదీ డ్రెస్‌లో ఓ యాక్ష‌న్ సీన్ ,ఆ వెంట‌నే కోటుసూటు వేసుకుని గ‌న్‌తో మ‌రో యాక్ష‌న్ సీన్‌, అన‌సూయ ఆశ్చ‌ర్యం, ముర‌ళీశ‌ర్మ హావ‌భావాలు, వెర‌సి ముగింపులో ఓ అమ్మాయి ర‌వితే పీక‌కోసేసిన‌ట్లుండే స‌న్నివేశం క‌నిపిస్తుంది. ఈ టీజ‌ర్‌కు బేక్‌గ్రౌండ్ మ్యూజీక్ ఆస‌క్తిగా అనిపించింది. 
 
ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ "ఖిలాడీ". 'ఇఫ్ యూ ప్లే స్మార్ట్ విత్ అవుట్ స్టుపిడ్ ఎమోషన్స్యూ,  ఆర్ అన్ స్టాపబుల్' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక టీజర్ చివర్లో వచ్చిన ట్విస్ట్ థ్రిల్ చేస్తోంది. రవితేజ ఒక అమ్మాయిని చంపడం చూస్తుంటే ఇందులో కిల్లర్ గా కన్పించబోతున్నాడా ? అనే అనుమానం వస్తోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మీరు కూడా 'ఖిలాడీ' టీజర్ ను వీక్షించండి. 
 
ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జయంతిలాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'ఖిలాడీ' ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా. టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవితేజకు ఇది 67వ చిత్రం.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి పేర్ని నానికి అర్జెంటుగా 'రాబిస్' వ్యాక్సిన్ వేయండి.. నాగబాబు ఫైర్