Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యవసర చికిత్స వార్డులో నటుడు కార్తీక్, ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది?

Advertiesment
Actor
, శనివారం, 10 ఏప్రియల్ 2021 (10:34 IST)
బహుభాషా చిత్రాల నటుడు సీనియర్ హీరో కార్తీక్ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా వున్నట్లు తెలుస్తోంది. ఆయనను అత్యవసర చికిత్స వార్డులో వుంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇటీవలి ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఆయనకు కరోనా పరీక్షలు చేయగా అందులో నెగటివ్ అని వచ్చింది కానీ శ్వాసకోస సమస్య తీవ్రంగా వున్నట్లు చెపుతున్నారు.
 
కార్తీక్ 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు 2018లో ఏర్పడిన మణిద ఉరిమైగల్ కాక్కుం కట్చికి నాయకత్వం వహిస్తున్నారు. కార్తీక్ 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎఐఎడిఎంకెతో తన కూటమిని కలిపేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎఐఎడిఎంకె నేతృత్వంలోని కూటమి కోసం ప్రచారం చేసారు. ప్రచారం చేస్తున్న సమయంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు.
 
సీతాకోకచిలుక, అభినందన, అన్వేషణ, మగరాయుడు లాంటి సినిమాలలో కనిపించిన నటుడు కార్తీక్‌ సుపరిచితుడే. అంతేకాదు మణిరత్నం ఘర్షణ మూవీ ఆయనకు తెలుగులో మంచి పేరు తెచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Dancee​+ షో.. గట్టిగా అరిచిన ముమైత్ ఖాన్.. కౌంటరిచ్చిన ఓంకార్ (Video)