Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

#Dancee​+ షో.. గట్టిగా అరిచిన ముమైత్ ఖాన్.. కౌంటరిచ్చిన ఓంకార్ (Video)

Advertiesment
Promo
, శనివారం, 10 ఏప్రియల్ 2021 (10:20 IST)
Mumaith khan
నిజానికి బుల్లితెర షోస్ అంటేనే జడ్జిమెంట్ హడావుడి అదే ఓంకార్ షో అంటే మరింత ఎక్కువ. ఎందుకంటే రేటింగ్స్ విషయంలో ఎంతో కష్టపడే యాంకర్ ఓంకార్. అందుకే గత 15 ఏళ్లలో ఎన్నో షోస్ చేసిన ఓంకార్ అన్నింటిలోనూ ఇలాంటి జడ్జిమెంట్ కాంట్రవర్సీలు ఉన్నాయి. తాజాగా డ్యాన్స్ ప్లస్ షోలో యాంకర్ అయిన ఓంకార్ మ్యాజిక్ కోసం.. అప్పుడప్పుడు లేడీ జెడ్జిలను స్టేజిపై తీసుకొచ్చి వాళ్ళతో డ్యాన్స్ చేపిస్తూ షోను హైలెట్ చేస్తున్నారు.
 
ఇక ఈ డ్యాన్స్ ప్లస్ షోకు ముమైత్ ఖాన్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే శనివారం ప్రసారం కానున్న డ్యాన్స్ ప్లస్ షో కు సంబంధించి ప్రోమో విడుదల చెయ్యగా ఆ ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో కంటెస్టెంట్‌కి ముమైత్ ఖాన్‌కు గొడవ జరగగా ఆ గొడవలో ముమైత్ ఖాన్ గట్టిగట్టిగా అరవగా.. ఎందుకు సీరియస్ అవుతున్నారూ అంటూ ఓంకార్ ప్రశ్నించగా.. ఆమె నేను ఇక్కడ జడ్జిని అతను నన్ను పాయింటౌట్ చేస్తున్నాడు అంటూ ఫైర్ అవుతుంది.
 
సరే కూల్ అవ్వండి అంటూ ఓంకార్ చెప్పిన వినకుండా అప్పటికి ముమైత్ ఖాన్ తన కోపాన్ని తగ్గించకపోవడంతో ఓంకార్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తప్పు ఏదైన చేస్తే నన్ను పాయింట్ అవుట్ చెయ్యండి.. మీరు ఇద్దరు కొట్టుకుని నన్ను పాయింట్ అవుట్ చేస్తారు ఏంటి అంటూ ముమైత్ ఖాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. మరి ఈ కాంట్రవర్సీ ఫుల్ స్టోరీ ఏంటో ఈరోజు తెలుస్తుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి ఎందుకు `మా`కు రాజీనామా చేశారో తెలుసా!