Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ భర్తకు జైలుశిక్ష... లగ్జరీ కారు దిగుమతి కేసులో...

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె భర్త ఎం నటరాజన్‌కు రెండేళ్ళ జైలుశిక్షను ఖరారు చేస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. రూ.1.62 కోట్ల విలు

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (15:24 IST)
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె భర్త ఎం నటరాజన్‌కు రెండేళ్ళ జైలుశిక్షను ఖరారు చేస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. రూ.1.62 కోట్ల విలువ చేసే లగ్జరీ కారును విదేశాల నుంచి 2009లో నటరాజన్ దిగుమతి చేసుకున్నారు. దీనికి పన్ను చెల్లించక పోవడంతో సీబీఐ కేసు నమోదు చేయగా, కేసు విచారణ కూడా సీబీఐ కోర్టులో జరిగింది. 
 
ఈ విచారణ అనంతరం 2010లో సీబీఐ కోర్టు నటరాజన్‌తో పాటు.. నలుగురిని దోషులుగా నిర్ధారించి, రెండేళ్లు జైలుశిక్షను విధించింది. దీంతో ఆ నలుగురు సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయగా, కిందికోర్టు ఇచ్చిన తీర్పును మద్రాసు హైకోర్టు ఖరారు చేసింది. కాగా, ఈ కేసులో అక్రమాస్తుల కేసులో మూడేళ్ళ జైలు శిక్ష పడిన శశికళ బంధువు భాస్కరన్ కూడా ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments