Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

అక్రమాస్తుల కేసు : శశికళ బంధువుకు ఐదేళ్ళ జైలుశిక్ష

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కుటుంబానికి గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మంచిన ఆస్తుల సేకరణ కేసులో శశికళ బంధువుకు ఐదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు కోర్టు తీర్పునిచ్

Advertiesment
Sasikala
, గురువారం, 16 నవంబరు 2017 (16:29 IST)
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కుటుంబానికి గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మంచిన ఆస్తుల సేకరణ కేసులో శశికళ బంధువుకు ఐదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు కోర్టు తీర్పునిచ్చింది. 
 
శశికళ బంధువు భాస్కరన్ అనే వ్యక్తి భారతీయ రిజర్వు బ్యాంకులో పని చేస్తూ వచ్చారు. ఈయన ఆదాయానికి మించి ఆస్తులు సేకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐటీ అధికారులు సోదాలు చేసి 1.68 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమాస్తులను గుర్తించారు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. 
 
ఈ కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు భాస్కరన్‌తో పాటు ఆయన భార్యకు ఐదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మద్రాసు హైకోర్టులో ఆయన అప్పీల్ చేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు, సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది. అయితే, భాస్కరన్ భార్యకు మాత్రం మూడేళ్ళ జైలుశిక్ష విధించింది. 
 
కాగా, ఇటీవల ఐటీ సోదాలతో ఉక్కిరిబిక్కిరి అయిన శశికళ కుటుంబ సభ్యులు తాజా తీర్పుతో మరింత షాక్‌కు గురయ్యారు. కాగా, శశికళ, దినకరన్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఇళ్ళపై ఐటీ శాఖ అధికారులు ఏకధాటిగా ఐదు రోజుల పాటు విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఈ సోదాల్లో అధికారికంగా రూ.1430 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విషయంలో తమ్ముడితో గొడవ పడిన మాజీ సిఎం