Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శశి మన్నార్గుడి మాఫియా ఆస్తుల విలువ రూ.30 వేల కోట్లు

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తి విలువ రూ.30 వేల కోట్లుగా ఉన్నట్టు ఓ ప్రాథమిక అంచనా. గత ఐదు రోజులుగా శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు, బినామీల నివా

శశి మన్నార్గుడి మాఫియా ఆస్తుల విలువ రూ.30 వేల కోట్లు
, బుధవారం, 15 నవంబరు 2017 (12:40 IST)
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తి విలువ రూ.30 వేల కోట్లుగా ఉన్నట్టు ఓ ప్రాథమిక అంచనా. గత ఐదు రోజులుగా శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు, బినామీల నివాసాల్లో జరిగిన ఆదాయపన్ను శాఖ అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. 
 
అంతేకాకుండా అక్రమ నగదు బట్వాడాలు, బినామీ కంపెనీల నిర్వహణ తదితర అక్రమ కార్యకలాపాల ద్వారా రూ.1,500 కోట్ల దాకా పన్ను ఎగవేసినట్లు కూడా ఆదాయపు పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారంతో రూపొందించిన నివేదికను స్థానిక ఐటీ అధికారులు ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి పంపారు. 
 
దేశచరిత్రలోనే తొలిసారిగా ఓ కుటుంబం అక్రమ సంపాదనపై రెండు వేలమంది అధికారులు, మెగా స్థాయిలో ఐదు రోజులపాటు 200 చోట్ల ఆకస్మికదాడులను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, ఐటీ అధికారులు సోదాలు జరిపిన తీరు, తమను ప్రశ్నిస్తున్న పద్ధతి.. రాజకీయ ప్రేరేపితంలా అనిపించడం లేదని శశికళ మేనల్లుడు, జయ టీవీ సీఎంవో వివేక్‌ జయరామన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. 
 
ఇదిలావుండగా, మన్నార్గుడి మాఫియాగా పేరొందిన శశికళ కుటుంబీకుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న దస్తావేజులు, నగలు, నగదు, విలువైన పరికరాలను సుమారు పది వాహనాలలో చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ శాఖ కార్యాలయానికి తరలించారు. బెంగళూరు, పుదుచ్చేరి నుంచి పలు దస్తావేజులు, నగలను చెన్నైకి తీసుకొచ్చారు. వీటి పరిశీలనకు 30 మంది ఆడిటర్లు, వెయ్యిమందికి పైగా ఐటీ ఉద్యోగులను వినియోగించారు. 
 
అంతేకాకుండా, గత ఐదు రోజుల సోదాల్లో రూ.7.14 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. పట్టుబడిన వజ్రాభరణాల విలువను స్వర్ణకారుల ద్వారా అంచనా వేయిస్తున్నట్టు చెప్పారు. ఇక శశికళ, దినకరన్‌ కుటుంబీకులంతా కలిసి సుమారు రూ.1500 కోట్లకు పైగా పన్నులు చెల్లించకుండా మోసగించారని దాడులలో పట్టుబడిన దస్తావేజుల ద్వారా రుజువైందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న ఖాకీ... నేడు నేతాశ్రీ... బీజేపీ మంత్రికి ఫుట్ మసాజ్