Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ ప్రియురాలు రియాపై అభియోగాలు.. అంతా ఆమె వల్లే జరిగింది

Webdunia
బుధవారం, 13 జులై 2022 (12:52 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు దర్యాప్తులో పురోగతి చోటుచేసుకుంది. 2020లో మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అతని ప్రియురాలు నటి రియా చక్రవర్తిపై అభియోగాలు నమోదయ్యాయి.
 
ఆ మేరకు నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఆమెతో పాటు మరో 34 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రియా చక్రవర్తి గంజాయిని కొనుగోలు చేసి సుశాంత్ సింగ్‌కు డెలివరీ చేసినట్లు అభియోగాలు మోపారు. 
 
ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా నిందితుడిగా చేర్చారు. రియా చక్రవర్తి ఎవరి దగ్గరి నుంచి గంజాయి కొనుగోలు చేసిందో వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. డ్రగ్స్ కొనుగోలు చేసి సమకూర్చినందునే సుశాంత్ ఈ అలవాటుకు బానిసైనట్లు ఛార్జిషీటులో పేర్కొన్నారు. 
 
అయితే తనపై ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదంటూ రియా చక్రవర్తి ఇది వరకే కొట్టిపారేశారు. కోర్టులో ఎన్సీబీ మోపిన అభియోగాల మేరుకు నేరం రుజువైతే మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద రియా చక్రవర్తికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
 
ఈ కేసులో రియా చక్రవర్తి 2020 సెప్టెంబర్‌లో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆమె అరెస్ట్ అయిన దాదాపు నెల తర్వాత బాంబే హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments