Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్‌నాథ్‌ యాత్ర రద్దు నిర్ణయంపై పునరాలోచన

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (16:03 IST)
కరోనా కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. ఆ వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకుంది జమ్మూకశ్మీర్‌ అధికార యంత్రాంగం. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది జూన్‌ 23 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ యంత్రాంగం ఓ ప్రకటనలో వెల్లడించింది.

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ మర్ము నేతృత్వంలో జరిగిన శ్రీ అమర్‌నాథ్‌జీ బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తొలుత పేర్కొన్నారు.

ప్రథమ పూజ, సంపన్న పూజలను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసి.. ఆ వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నారు. 
 
దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లోని అమర్‌నాథుడిని దర్శనార్థం ఏటా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. మొత్తం  42 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఈ ఏడాది జూన్‌ 23 నుంచి ఆగస్టు 3 వరకు జరగాల్సి ఉంది.

కశ్మీర్‌లో తీవ్ర ఉగ్రవాద ముప్పు ఉన్న సమయంలోనూ ఈ యాత్ర జరగడం గమనార్హం. మరి ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments