Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్నాబ్ గోస్వామిపై దుండగుల దాడి.. ఢిల్లీలో కలకలం

Advertiesment
ఆర్నాబ్ గోస్వామిపై దుండగుల దాడి.. ఢిల్లీలో కలకలం
, గురువారం, 23 ఏప్రియల్ 2020 (09:42 IST)
ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ టీవీ చానెల్ అయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి దంపతులపై గురువారం వేకువజామున దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. ముంబైలోని స్టూడియో నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ దాడిలో గోస్వామి దంపతులకు ఎలాంటి గాయాలుకాలేదు. 
 
కానీ, వారు ప్రయాణిస్తున్న కారు మాత్రం దెబ్బతింది. ఈ దాడిపై అర్నాబ్‌ గోస్వామి, సమియా గోస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
కాగా, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాలో విశ్వసనీయత లోపించిందంటూ అర్నాబ్ గోస్వామి బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసి 24 గంటలకు తిరగక ముందే ఈ దాడి జరగడం గమనార్హం. 
 
కాగా, మహారాష్ట్రలోని పాల్‌ఘార్‌లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్‌పై గుంపు దాడి ఘటన నేపథ్యంలో టీవీ లైవ్‌ చర్చలో అర్నాబ్‌ తన రాజీనామాను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసినట్లు ముంబై జోన్‌ 3 డీసీపీ ప్రకటించారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో కలకలం... పిల్లులకు కూడా కరోనా...