Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మృతి.. చితి మంటల్లో దూకేసిన కూతురు.. చివరికి?

Webdunia
గురువారం, 6 మే 2021 (10:54 IST)
కరోనా మహమ్మారితో తండ్రిని కోల్పోయిన కూతురు ఆ బాధను భరించలేక ఏం చేసిందో తెలిస్తే మనందరి మనసును కలిచివేయడం ఖాయం. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని బార్మెర్‌లోని రాయ్ కాలనీకి చెందిన దామోదర్ దాస్ శర్గాకు ఇటీవల కరోనా సోకింది. కరోనాతో ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో ఆయన మృతి చెందాడు. 
 
కాగా ఇటీవల ఆయన భార్య కూడా మరణించగా, వారికి ముగ్గురు కుమార్తెలు. తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన 34 ఏళ్ల చిన్నకూతురు చంద్ర శర్గా తన తండ్రి చితిమంటల్లోకి దూకేసింది. ఇంకా పెళ్లి కాకుండా ఉన్న ఆమె, తన తల్లిదండ్రులను కోల్పోవడంతో తీవ్ర ఆందోళనకు గురై ఇలా తండ్రి చితిమంటల్లోకి దూకినట్లు తెలుస్తోంది.
 
అయితే ఆమెను అక్కడున్నవారు వెంటనే ఆమెను మంటల్లో నుండి బయటకు లాగారు. కాగా ఆమె అప్పటికే 70 శాతం కాలిపోవడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా ఉన్నవారిని కలిచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments