Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపా నేత రోజా కుమార్తె అన్షుకు ఐ లవ్ యూ చెప్పాడు..?

Advertiesment
వైకాపా నేత రోజా కుమార్తె అన్షుకు ఐ లవ్ యూ చెప్పాడు..?
, బుధవారం, 5 మే 2021 (19:12 IST)
వైకాపా నేత రోజా సెల్వమణి. తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కూడా తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ప్రజలకు సేవలందిస్తూ రాజకీయ నాయకురాలిగా అదరగొడుతున్నారు. 
 
మరోవైపు జబర్ధస్త్ కామెడీ షో వంటి ప్రోగ్రామ్‌లకు జడ్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాదు ఎమ్మెల్యేగా ఏపీఐఐసీ చైర్ పర్సన్‌గా తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 
 
ప్రస్తుతం రోజా కూతురు అన్షు మాలిక కూడా సోషల్ మీడియాలో సుపరిచితం. అన్షు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగా ఆమె తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌తో మాట్లాడింది. 
 
నెటిజన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. "మీ నాన్న ఏమని పిలుస్తారు.. అని అడగ్గా తమిళ్‌లో మగలే అంటూ.." దానికి సమాధానం చెప్పింది. 
 
ఇక యూట్యూబ్‌లో తనకు ఎటువంటీ ఛానల్ లేదని పేర్కోంది. విజయ్ సేతుపతి అంటే ఇష్టమని, తాను ఏడు సంవత్సరాల వయస్సు నుంచే కంప్యూటర్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నానని తెలిపింది.
 
ఇక ఈ ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో భాగంగా ఓ నెటిజన్ ఆమెకి ఐ లవ్ యూ అని స్పానిష్ భాషలో తెలిపాడు. దీనికి అన్షు 'ఐ లవ్‌ యూ.. థాంక్యూ' అంటూ రిప్లై ఇచ్చింది. తనకు దంగల్, ఇన్సెప్షన్ సినిమాలు ఇష్టమని తెలిపింది. తెలుగులో నాగార్జున సినిమాలు చాలా ఇష్టమని తెలిపింది. 
 
ఇక 'మీరు హీరోయిన్ అవుతారా.. లేదా?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అన్షు సమాదానమిస్తూ.. ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు. దానికి నా సమాధానం లేదు.. నాకు తెలియదు.. అసలు నేను ఆ ఆలోచన కూడా చేయలేదు' అంటూ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో కరోనాతో 25మంది పోలీసుల మృతి, ఇ -పాస్ తప్పనిసరి