కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో నర్సుపై దాడి చేసిన యువకుడు

Webdunia
గురువారం, 6 మే 2021 (09:59 IST)
హైదరాబాద్ నగరంలో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో ఓ నర్సుపై దాడి జరిగింది. కొవిడ్‌ టీకా ఇస్తున్న నర్సుపై వ్యాక్సిన్‌ కోసం వచ్చిన వ్యక్తి చేయిచేసుకుని అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని వెల్‌నెస్‌ కేంద్రంలో బుధవారం సాయంత్రం 4:15 గంటలకు గచ్చిబౌలికి చెందిన ఐటీ ఉద్యోగి రాజేశ్‌(24) టీకా కోసం వచ్చాడు. 
 
తన సమయం ముగిసిందని నర్సు మంజుల చెప్పగా.. తాను బుక్‌చేసుకున్నాక ఎలా అయిపోతుందని వాగ్వాదానికి దిగాడు. టీకా అయిపోయిందని, తామేమీ చేయలేమని ఆమె చెబుతుండగా వీడియో తీసే ప్రయత్నం చేశాడు. 
 
వీడియో తీయకుండా అడ్డుకోబోగా నర్సు చేయిపట్టుకుని.. ముఖాన్ని గట్టిగా నెట్టివేశాడు. దీంతో ఆమె నోటిపై గాయమైంది. మిగతా సిబ్బంది అడ్డుకోగా వారిని అసభ్య పదజాలంతో దూషించాడు. నర్సు ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేస్తున్నట్లు వారు తెలిపారు. సిబ్బందిపై దాడిని నిరసిస్తూ గురువారం విధులు బహిష్కరించనున్నట్లు నర్సులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments