Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలంలో పనిచేస్తున్నా వదిలిపెట్టలేదు.. 13 రోజులు నరకం చూపించిన కామాంధులు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (11:03 IST)
నిర్భయ, దిశలాంటి కఠిన చట్టాలు వచ్చినా.. ఉరిశిక్షలు అమలు చేస్తున్నా.. కామాంధుల్లో ఎలాంటి మార్పు రావట్లేదు. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నీచులు దురాఘతాలకు ఒడిగడుతున్నారు. లాక్ డౌన్ సమయంలోనూ దేశంలో ఎక్కడో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. 
 
తాజాగా పొలంలో పని చేసుకుంటున్న మహిళను అపహరించి గ్యాంగ్‌ రేప్ చేసిన ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది. మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు సుమారు రెండు వారాల పాటు నిర్బంధించి నరకం చూపారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది.
 
రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పొలంలో పనిచేసుకుంటున్న మహిళను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అలా 13 రోజులు ఆమెను బంధించి.. అత్యాచారానికి పాల్పడి తమ కామవాంఛ తీర్చుకున్నారు. కామాంధుల చెర నుంచి ఎలాగో తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 
 
ఏప్రిల్ 3న ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్బంధించి అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 15 వరకూ నిందితులు తనను బంధించి గ్యాంగ్ రేప్ చేశారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం