Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆయనకు ఇద్దరు భార్యలు, మూడవ మహిళతో శృంగారంలో తేలుతూ

Advertiesment
ఆయనకు ఇద్దరు భార్యలు, మూడవ మహిళతో శృంగారంలో తేలుతూ
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (19:05 IST)
ఆశకు అంతే లేదంటారు. ఇది నిజమే అనిపిస్తోంది ఈ వ్యక్తి గురించి చదివితే. ప్రేమించి ఒకరిని.. పెళ్ళి చేసుకున్న తరువాత ఇంకొకరిని పెళ్ళి చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఇద్దరితో సంసారం సాఫీగా సాగిస్తూ అదీ చాలక మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నెలరోజుల పాటు బాగా ఎంజాయ్ చేశాడు. తప్పు చేస్తే ఎన్నోరోజులు తప్పించుకు తిరగడం సాధ్యం కాదు కదా అడ్డంగా దొరికిపోయాడు. 
 
ఆగ్రా సమీపంలోని గ్రామంలో నివాసముండే ప్రభుత్వ ఉద్యోగి చంద్రకుమార్‌కు ఇద్దరు భార్యలు. ప్రేమించి ఒకరిని, పెళ్ళి చేసుకున్న తరువాత బంధువుల్లోనే మరొకరిని వివాహం చేసుకున్నాడు. పెళ్ళి తరువాత మొదటి భార్య ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో రెండవ పెళ్ళి చేసుకున్నాడు. 
 
అయితే ఇద్దరూ సర్దుకుని చంద్రకుమార్‌తో సంసారం చేసేవారు. అయితే తన వీధిలోనే ఉండే కోమలి అనే వివాహితపై చంద్ర కన్నుపడింది. ఆమె భర్త కూడా విదేశాల్లో ఉన్నాడు. దీంతో చంద్ర కుమార్.. కోమలిని మాయమాటలతో లొంగదీసుకున్నాడు. నెలరోజుల పాటు వీరి మధ్య ఈ తతంగం బాగానే సాగింది.
 
అయితే వారంరోజుల క్రితం చంద్రకుమార్ బావమరిది సూరజ్‌కు అనుమానం వచ్చింది. విషయాన్ని తన అక్క దృష్టికి తీసుకెళ్ళాడు. రెండు రోజుల క్రితం చంద్రకుమార్‌ను వెంబడించిన సూరజ్ కోమలి ఇంటికి వెళ్ళడాన్ని గమనించాడు. దీంతో నిన్న చంద్రకుమార్ ఇద్దరు భార్యలను సూరజ్ గోప్యంగా కోమలి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అతడు కోమలితో మంచి రసపట్టులో ఉండగా రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు.
 
అంతటితో ఆగలేదు. ఇద్దరినీ చావబాదారు. దీంతో కోమలి అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోగా చంద్రకుమార్‌కు దెబ్బలు బాగానే తగిలాయి. ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. వీరి గొడవ ఆ గ్రామం మొత్తం చర్చనీయాంశమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్ ఎత్తివేయడం అనుమానమే అంటున్న బీజేపీ నేత!!