ఛత్తీస్‌గఢ్‌‌లో పూర్తి స్థాయి లాక్ డౌన్.. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (14:43 IST)
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో వారం రోజులపాటు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించనున్నారు. ఈ మేరకు దుర్గ్‌ జిల్లా కలెక్టర్‌ సర్వేశ్వర్‌ భూరే మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ఈ నెల ఏప్రిల్‌ 6 నుంచి 14వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలిపారు.
 
ఇప్పటికే దుర్గ్ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. అంతేకాక బస్తర్‌, మహాసముంద్‌, రాజ్‌నంద్‌గావ్‌, రాయగఢ్‌, రాయ్‌పూర్‌, కొరియా, సుక్మా జిల్లాల్లో గత మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లో చేస్తున్నారు. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేస్తున్నారు.
 
ఇదిలావుంటే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 4617 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,53,804కు చేరింది. ఇందులో 3,20,613 మంది కరోనా నుంచి కోలుకోగా.. 28,987 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు మహమ్మారి కారణంగా 4204 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారా, ది గర్ల్ ఫ్రెండ్ స్ఫూర్తినిచ్చింది - హేషమ్ అబ్దుల్ వహాబ్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments