Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహరాష్ట్రలో కరోనా విశ్వరూపం : మాల్స్ క్లోజ్... 28 నుంచి నైట్ కర్ఫ్యూ

మహరాష్ట్రలో కరోనా విశ్వరూపం : మాల్స్ క్లోజ్... 28 నుంచి నైట్ కర్ఫ్యూ
, శనివారం, 27 మార్చి 2021 (07:51 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శించింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యల దిశగా సాగుతోంది. 
 
రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సీఎం ఉద్ధవ్‌ థాకరే నిర్ణయించారు. గత కొన్ని వారాలుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ నెల 28 నుంచి కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
 
రాష్ట్రంలో కరోనా పరిస్థితి, కట్టడి చర్యలపై డివిజనల్‌ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎస్పీలతో పాటు వైద్యాధికారులతో సీఎం శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 
 
లాక్డౌన్‌ విధించడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. అయితే, కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఆరోగ్య సంరక్షణ వసతులు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా రోగులకు అవసరమైన పడకలు, మందులను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఉద్ధవ్‌ ఆదేశించారు. రాత్రిపూట కర్ఫ్యూకి సంబంధించిన ఉత్తర్వులను విపత్తు నిర్వహణ శాఖ త్వరలోనే విడుదల చేస్తుందని సీఎం కార్యాలయం వెల్లడించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాల్స్‌ మూసివేయాలని ఆదేశించింది.
 
కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ప్రజలు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం సహకరించకుంటే మరో లాక్డౌన్ తప్పదని కూడా ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నీలం సాహ్ని