ప్రొఫెసర్ పంపిన అసభ్యకర ఫోటోలు... చితకబాదిన విద్యార్థినిలు (వీడియో)

అమ్మాయిలను వేధించడంలో పోకిరిలు మాత్రమే కాదు ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు కూడా ఉన్నారు. ఇలాంటివారిలో గురువు స్థానంలో ఉండి విద్యాబుద్ధులు నేర్పేవారు ఉండటం గమనార్హం.

Webdunia
సోమవారం, 7 మే 2018 (13:22 IST)
అమ్మాయిలను వేధించడంలో పోకిరిలు మాత్రమే కాదు ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు కూడా ఉన్నారు. ఇలాంటివారిలో గురువు స్థానంలో ఉండి విద్యాబుద్ధులు నేర్పేవారు ఉండటం గమనార్హం.
 
తాజాగా, పాటియాలా ప్రభుత్వ మహిళల కాలేజీలో చదువుకునే కొందరు విద్యార్థినిలకు ఆ కాలేజీలో విద్యాబుద్ధులు చెప్పే ప్రొఫెసర్ అసభ్యకర ఫోటోలతో పాటు సందేశాలను పంపించారు. దీంతో విద్యార్థినిలు ఆగ్రహంతో రగిలిపోయారు. 
 
వెంటనే కొంతమంది విద్యార్థినిలు కలిసి కాలేజీ ప్రొఫెసర్‌ను పట్టుకుని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు విద్యార్థినులు అతన్ని ఈడ్చుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. 
 
యూనివర్సిటీల్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. ఆ మధ్య ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోనూ ఇలాగే విద్యార్థినులను అక్కడి ప్రొఫెసర్ లైంగికంగా వేధించడం కలకలం రేపింది. ఆ ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగిన విషయం తెల్సిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

Rahul Sankrityan: వీడీ 14 లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు - రాహుల్ సంకృత్యన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం