Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసలు అమ్మాయిలకు బాయ్‌ఫ్రెండ్స్ అవసరమా?: శాక్య ప్రశ్న

బీజేపీ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ గుణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య అమ్మాయిలకు ఉచిత సలహా ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. గత ఏడాది బాలీవుడ్ నటి అ

Advertiesment
అసలు అమ్మాయిలకు బాయ్‌ఫ్రెండ్స్ అవసరమా?: శాక్య ప్రశ్న
, సోమవారం, 26 మార్చి 2018 (11:44 IST)
బీజేపీ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ గుణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య అమ్మాయిలకు ఉచిత సలహా ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. గత ఏడాది బాలీవుడ్ నటి అనుష్క శర్మను ఇటలీలో వివాహం చేసుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దేశభక్తిని ప్రశ్నించి అప్పట్లో వార్తల్లోకెక్కారు. తాజాగా యువతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
 
అబ్బాయిలతో అమ్మాయిలు స్నేహం చేయడం మానేస్తేనే మహిళలపై దాడులు జరగవన్నారు. అదే విధంగా అబ్బాయిలు కూడా అమ్మాయిలను ఆకర్షించే విధంగా దుస్తులు ధరించకూడదని తెలిపారు.
 
యువతులను ఉద్దేశించి.. అసలు అమ్మాయిలకు బాయ్‌ఫ్రెండ్స్ అవసరమా అంటూ శాక్య ప్రశ్నించారు. అబ్బాయిలతో స్నేహం చేయడం ఆపేస్తే యువతులపై దాడులు కూడా ఆగిపోతాయన్నారు. ఇది యువతులకే మంచిదని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2019 ఎన్నికల తర్వాత మా బాస్ కేసీఆరే ప్రధాని కావొచ్చు: జితేందర్ రెడ్డి