Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల దాష్టీకం.. గర్భిణీపై ట్రాక్టర్ ఎక్కించి చంపేశారు..

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (16:36 IST)
జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇన్‌స్టంట్ లోన్ల పేరిట చాలామంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు వున్నాయి. అయితే జార్ఖండ్‌లో లోన్ రిక‌వ‌రీ ఏజెంట్లు దారుణానికి ఒడిగట్టారు. గర్భిణి అయిన రైతు కూతురుపై ట్రాక్ట‌ర్ ఎక్కించి ఆమె మృతికి కార‌ణం అయ్యారు.
 
జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాధితురాలు తండ్రి ఓ ప్ర‌ముఖ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకొని ట్రాక్ట‌ర్ కొనుగోలు చేశారు. వాయిదాలు చెల్లించ‌క‌పోవ‌డంతో ఏజెంట్లు ట్రాక్ట‌ర్‌ను స్వాధీనం చేసుకోవాల‌ని అనుకున్నారు. 
 
కానీ, రైతుకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వ‌కుండానే ఇంటికి వెళ్లారు. ఈ స‌మ‌యంలో ఇంటిద‌గ్గ‌ర ఉన్న రైతు కుమార్తెకు, ఏజెంట్ల‌కు మధ్య వాగ్వాదం జరిగింది.
 
ఆమెపై దాడి చేసి, ప‌క్క‌కు తోసేసి రిక‌వ‌రీ ఏజెంట్లు ట్రాక్ట‌ర్ తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. స‌ద‌రు మ‌హిళ అడ్డు రావ‌డంతో ఆమెపైకి ట్రాక్ట‌ర్ ఎక్కించారు. 
 
తీవ్ర గాయాల పాలైన గ‌ర్భిణిని బంధువులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్ప‌టికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments