Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఉండగానే.. మరో స్త్రీని ఇంటికి తెచ్చుకుని కాపురం పెట్టాడు..

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (17:42 IST)
భార్య ఉండగానే మరో స్త్రీతో ప్రేమ కలాపాలు సాగించి ఏకంగా ప్రభుత్వ అధికారిక భవనంలోనే కాపురం పెట్టాడు ఓ ఐపిఎస్ అధికారి. విడాకులు తీసుకోకముందే మరో మహిళతో సంబంధం పెట్టుకోవడంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై హోం మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. వెంటనే అతడిని డిస్మిస్ చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ చౌదరి, మరో ఐపిఎస్ అధికారిణిని ప్రేమించాడు. 2005లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల పాటు సాఫీగా సాగిన వారి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. తరచూ గొడవల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
దీనికోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. 2018 మే5న న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. చట్టబద్ధంగా విడిపోకముందే భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నేరుగా ఆమెను తెచ్చి ప్రభుత్వ అధికారిక బంగళాలో కాపురం పెట్టాడు. ఫలితంగా వారికి ఒకరు సంతానం కలిగారు. 
 
అయితే భార్య ఫిర్యాదు మేరకు ఆల్ ఇండియా సర్వీస్ యాక్ట్ 1968 ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకుని అధికారిక భవనంలో నివాసం ఉన్నందుకు అధికారిని డిస్మిస్ చేస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. దీనిపై సదరు అధికారి కోర్టుని ఆశ్రయించి న్యాయం కోరుతానని వెల్లడించారు. భార్య అంగీకరించిన తర్వాత ఆ మహిళతో ఉంటున్నట్లు చెప్పడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

తర్వాతి కథనం
Show comments